రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ ....... జిల్లా లో డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ లపై స్పెషల్ డ్రైవ్
-- జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ఆగష్టు నెల అంతా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని గౌరవ డిజిపి హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈనెలలో స్పెషల్ డ్రైవ్ లు :
ఆగస్టు 10 వరకు: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంకెన్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్.
_ ఆగస్టు 11–17 వరకు : వేగాన్ని మించి అతి వేగంగా వెళ్లే వాహనాల పై హై స్పీడ్ డ్రైవ్.
_ ఆగస్టు 18–24: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారి పై హెల్మెట్ డ్రైవ్.
_ ఆగస్టు 25–31: ప్రమాదాలకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు బ్లాక్ స్పాట్ గుర్తింపు డ్రైవ్ నిర్వహించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఆయా సి.ఐ లు/ ఎస్సై ల ఆధ్వర్యంలో పోలీసులు రహదారుల పై వాహనాల తనిఖీలు , డ్రంకెన్ డ్రైవ్ మరియు ఒపెన్ డ్రింకింగ్ ల పై నిఘా వేసి చర్యలు చేపట్టారు.
2025 జనవరి నుండి ఆగష్టు 7 వ తేది వరకు .
డ్రంకెన్ డ్రైవ్... మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పై 5,397 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
ఒపెన్ డ్రింకింగ్ ... బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారి పై 11,362 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.