*కేంద్ర నోడల్ అధికారికి ఘన స్వాగతం*
పార్వతీపురం / సీతంపేట, నవంబర్ 26 : కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మకు సీతంపేటలో ఘన స్వాగతం లభించింది. ఆశావాహ జిల్లా మరియు బ్లాక్స్ ప్రోగ్రాంకు జిల్లా కేంద్ర నోడల్ అధికారిగా సీతంపేటకు విచ్చేసిన ఆమెకు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాధ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్ జిల్లాలో గిరిజన సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను సంక్షిప్తంగా ఆమెకు వివరించారు.