V3. మన్యం జిల్లా. స్టాప్ రిపోర్టర్ తవిటి రాజు
*షాపుల ముందు పరిశుభ్రత అవసరం*
*చెత్తను ఆరుబయట వేస్తే చర్యలు*
*జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది*
పార్వతీపురం, నవంబర్ 11 : మండల పరిధిలోని పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు బాగా జరగాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది తెలిపారు. షాపుల షాపుల ముందు పరిశుభ్రత అవసరమని, వారి చెత్తను ఆరుబయట వేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు. మంగళవారం మక్కువ రహదారిలో షాపుల ముందు ఉన్న చెత్తను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇందుకు స్థానిక సర్పంచులను బాధ్యులను చేయాలని, ప్రతి నెలా సర్పంచులతో సమావేశం ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. అలాగే హేబిటేషన్ స్థాయిలో జరిగే విషయాలను ఎంపీడీఓలకు చేరవేసేలా వ్యక్తులను ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సంతలు ముగిసిన పిదప చెత్తను, ప్లాస్టిక్ ను తొలగించే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆరుబయట చెత్తను వేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు జరీమానాను విధించాలని అన్నారు. సంతలను కొత్త తరహాలో రూపొందించాలని, ఆ దిశగా ఆలోచన చేసి చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ పర్యటనలో మండల, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.