రాఘవేంద్ర స్వామి సప్త రాత్రోత్సవాలు
భద్రత ఏర్పాట్లను పరిశీలించిన...
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ .
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సప్త రాత్రోత్సవాల ఏర్పాట్ల పై , మఠం పరిసర ప్రాంతాలు, తుంగభద్ర నది తీరం, ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం సాయంత్రం మంత్రాలయం పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు.
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మంత్రాలయం రాఘవేంద్రస్వామి
354వ,సప్త రాత్రోత్సవాల ( ఆగస్టు 8 నుండి 14 వ తేది వరకు ) సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తులు, చిన్నపిల్లలు, ప్రజలు తుంగ భద్ర నది వరద ఎక్కువగా ఉన్నప్పుడు నదిలోకి వెళ్ళకుండా అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ పోలీసులకు తగు సూచనలు తెలియజేశారు.
తుంగభద్రా నది తీరంలో పోలీసులు మఠం సిబ్బంది 24 గంటలు జాగ్రత్తగా బందోబస్తు నిర్వహించాలని సూచించారు.
బందోబస్తు ఏర్పాట్ల లో భాగంగా తుంగభద్ర నది లో ప్రవాహాం ఎక్కువగా ఉండడం వలన పోలీసులు ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లను , ట్రాఫిక్ పార్కింగ్ ప్రదేశాలు, క్యూలైన్ లు, విఐపిల ప్రోటోకాల్ గురించి జిల్లా ఎస్పీ మంత్రాలయం సిఐ రామంజులు,
ఎస్ఐ శివాంజల్ లు వివరించారు.
ఎమ్మిగనూరు సబ్ డివిజన్ డిఎస్పీ మంత్రాలయం పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు , సలహాలు తెలిపారు.
అనంతరం వాహనాల పార్కింగ్ స్థలం, శ్రీ మఠంలో భక్తులకు ఏర్పాట్లు తదితర ప్రాంతాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు .
లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిఎస్పీ భార్గవి, సిఐ రామాoజులు, ఎస్ఐ శివాంజల్ లకు సూచించారు
జిల్లా ఎస్పీ తో పాటు ఎమ్మిగనూరు డిఎస్పీ ఎన్. బార్గవి, స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజమూర్తి , మంత్రాలయం సిఐ రామంజులు , మంత్రాలయం ఎస్సై శివాంజల్, మఠం AAO మాధవ శెట్టి ఉన్నారు.