రగ్బీ రాష్ట్ర స్థాయి ఎస్ .జి.ఎఫ్ పోటీలకు మోడల్ స్కూల్ ఓర్వకల్ విద్యార్ధి ఎంపిక
సెప్టెంబర్ 10న కర్నూలు జిల్లాలో జరిగిన ఎస్ .జి.ఎఫ్ రగ్బీ లో జిల్లా స్థాయి పోటీలలో మన మోడల్ స్కూల్ ఓర్వకల్ విద్యార్ధి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఎస్.జి.ఎఫ్ రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు అని ప్రిన్సిపాల్ జోషిల వాట్స్ అన్నారు. జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో పోటీల క్రింది విద్యార్ధి సెలెక్ట్ అయ్యారు.
అండర్ – 19 విభాగంలో: రేవంత్ కుమార్
వారు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయికి ఎంపికైయాడు అని, ఈ పోటీలలో పాల్గొననున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ డి. శేఖర్ తెలియజేశారు.మన పాఠశాల విద్యార్ధి విజయంపై పీ.డీ డీ. శేఖర్ నీ ప్రిన్సిపాల్ హృదయపూర్వక అభినందనలు, విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సిబ్బంది అభినందించారు.