అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 మేర తగ్గించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారతీయులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశంలోని నారీశక్తికి ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
భారతీయ కుటుంబాల క్షేమం కోసమే గ్యాస్ సిలిండర్ ధరలను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ (సులభతర జీవనం) నినాదానికి అనుగుణంగా గ్యాస్ ధరలు తగ్గించేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు.