ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా సుఖేశ్ చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించాడు. జైలు నుంచి లేఖ విడుదల చేశాడు. 'కవిత అక్కయ్య' అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. "లిక్కర్ స్కామ్ కేసులో నిజం రుజువైంది. బూటకపు కేసులని, రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లూ నీవు చేసిన వాదన అబద్ధమని తేలిపోయింది. మీ పార్టీ వేలకోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచింది. నెయ్యి డబ్బాలన్న మీ కథలపై దర్యప్తు జరుగుతోంది" అని సుఖేశ్ లేఖలో పేర్కొన్నాడు.
ఇక మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన కవితపై ఇప్పటికే పలుమార్లు సంచలన ఆరోపణలు చేశాడు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్‌తో పాటు అనేక స్క్రీన్ షాట్లను విడుదల చేశాడు. మంగళవారం ఉదయం కవిత అరెస్టుపై స్పందిస్తూ సుఖేశ్ లేఖ విడుదల చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.