తన భర్త సూసైడ్ గురించి ప్రస్తావించిన జయసుధ

 


సోషల్ మీడియా వచ్చిన తరువాత మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారమవుతోంది. ఎవరికి  తోచింది వాళ్లు రాస్తున్నారు. అలాంటి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదుజయసుధ భర్త అప్పట్లో కొన్ని సినిమాలను నిర్మించారు. ఆ సినిమాల వలన నష్టాలు మాత్రమే మిగిలాయి. ఆ తరువాత కొంతకాలానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తాను నిర్మించిన సినిమాలు తెచ్చిపెట్టిన నష్టాల కారణంగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడనే టాక్ వచ్చింది.


అప్పుడు జయసుధ స్పందిస్తూ .. " మా వారు సూసైడ్ చేసుకోవడానికి కారణం అప్పులు .. ఆయన తీసిన సినిమాలు నష్టాలు తీసుకురావడమనే వార్తల్లో నిజం లేదు. అయినా ఆత్మహత్య చేసుకునేంత అప్పులు మాకు లేవు. సూసైడ్ చేసుకునే ఒక రకమైన మానసిక స్థితి మా పిల్లలకుగానీ .. వాళ్ల పిల్లలకు గాని రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకోవడమనేది మా అత్తగారి ఫ్యామిలీ వైపు ఉంది. మా వారి అన్నయ్య .. మరో ఇద్దరు లేడీస్ ఇలాగే సూసైడ్ చేసుకుని చనిపోయారు" అని అన్నారు.