గంజాయి అమ్ముతున్న నిందితుడు అరెస్ట్


రూ.3.5 లక్షల గంజాయి సీజ్ చేసిన సీఐ సద్గురుడు...గంజాయి అమ్ముతున్న నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు మదనపల్లి డి.ఎస్.పి శ్రీ ప్రసాద రెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లి రూరల్ సిఐ సద్గురుడుకు రహస్య సమాచారం అందింది అన్నారు. ఈ మేరకు ముదిపాడు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తో కలసి సిబ్బందితో వెళ్లి ముదివేడు గ్రామానికి దగ్గరలో గల సాయిబులవారిపల్లిలో చింత చెట్టు కింద గంజాయి అమ్ముతున్న షేక్ మహబూబ్ సాహెబ్ 46 పై రైడ్ చేసి పట్టుకొని అతని వద్ద రూ.3.50 లక్షల విలువైన ఏడు కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.  కేసు నమోదు చేసి విచారణ అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ తెలిపారు.