భారత క్రికెట్ జట్టుకు కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ ఎంపికపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా స్పందించాడు. ఐపీఎల్‌లో రోహిత్ ట్రాక్ రికార్డు దృష్ట్యా అతడిలో గొప్ప టాలెంట్ ఉన్నట్టు తనకు అనిపించిందని చెప్పుకొచ్చాడు. 2022లో కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకున్న అనంతరం రోహిత్.. టెస్టులు, టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉండడంతో విరాట్‌తో ఆయనకు పడట్లేదన్న వదంతులు కూడా వ్యాపించాయి.
‘‘వరల్డ్ కప్‌లో అతడు (విరాట్) ఎలా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడో చూడండి. భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అప్పటివరకూ టీమిండియా టాప్‌లో ఉంది. కాబట్టి, అతడు గొప్ప కెప్టెనే. అతడి సారథ్యం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. నేను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అతడు కెప్టెన్ అయ్యాడు. అతడిలో టాలెంట్‌ను గుర్తించాను కాబట్టే కెప్టెన్ చేశాను’’ అని గంగూలీ అన్నాడు.
సుదీర్ఘకాలంగా ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న రోహిత్ శర్మ స్థానంలో ఇటీవల హార్ధిక్ పాండ్యా వచ్చిన విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలో హార్దిక్ గుజరాత్ టైటన్స్ తరపున ఆడాడు.