ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వెనక్కి తీసుకోవాలి"... మువ్వల


" ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వెనక్కి తీసుకోవాలి"... మువ్వల

 కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరపై 50 రూపాయలు పెంచడం వల్ల సామాన్య వినియోగదారులు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన క్రింద లబ్ధిదారులకు ఆర్థిక భారం వేయడం దుర్మార్గమని అలాగే డీజిల్, పెట్రోల్ పై రెండు రూపాయలు చొప్పున పెంచి ఎక్సైజ్ సుంకం వలన సమాజంలోని పేద,మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారని తక్షణమే పెంచిన ఎక్సైజ్ సుంఖాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మువ్వల శ్రీనివాసరావు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్, పిసిసి అధికార ప్రతినిధి (మాజీ) డిమాండ్ చేశారు గత 15 నెలల్లో ఇది 9వసారి ధరల పెంపు జరిగిందని అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు ధరలు 41 శాతం తగ్గినప్పటికీ ఆ లాభాలను ప్రజలకు అందించకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఏదైతే ఎల్పీజీ,పెట్రోల్,డీజిల్ పై పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.