హుసేనాపురం గ్రామంలో బాల బాలుర గృహాలు నంద్యాల ఎంపీ శ్రీమతి బైరెడ్డి శబరి వినతి పత్రం..
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామంలో విద్య వ్యవస్థలో పోటీ పడటానికి విద్యార్థులకు సరైన బాల బాలుర గృహాలు లేక విద్యార్థులు మధ్యలోనే వారి చదువును మానేసి విద్యకు దూరమవుతున్నారు, వీటివల్ల చదువుకోవాల్సిన విద్యార్థులు వివిధ పనులకు వెళ్లటమే కాక చదువురాని వారిగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు వీటిని దృష్టిలో పెట్టుకొని హుసేనాపురం గ్రామం చుట్టూ ఉన్న దాదాపు 25 గ్రామాల విద్యార్తులకు వసతి గృహాలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, అదేవిధంగా హుసేనాపురం గ్రామంలో , ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, ప్రైవేట్ స్కూలు, మరియు వెటర్నరీ కాలేజీలు ఉండటం చేత హుసేనాపురం గ్రామం కేంద్ర బిందువుగా మారింది, ఇందుకుగాను హుసేనాపురం గ్రామంలో ఎస్సీ, బీసీ బాలుర హాస్టల్స్ ను నిర్మించాలని జై భీమ్ ఆర్గనైజేషన్ తరపున ఎంపీ గారిని కోరడమైనది.