జిల్లాస్థాయి యోగాంధ్ర పోటీలలో విజేతలైన 19 విద్యార్థులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం కర్నూలులోని తన క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్
రంజిత్ బాషా మాట్లాడుతూ
విద్యార్థులు ప్రతిరోజు దైనందిన జీవితంలో యోగా సాధన అంతర్భాగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు విద్యార్థులు యోగ సాధన చేయడం కోసం ప్రత్యేకంగా సెంటర్ ను ఏర్పాటు చేస్తానని అన్నారు.ఆ దిశగా సంబంధిత అధికారులకు సైతం ఆదేశాలు ఇచ్చారు
నెల రోజుల పాటు జరిగిన యోగాంధ్ర కార్యక్రమాలలో
చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు.జిల్లా స్థాయిలో వివిధ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఎంపికై విజయవాడలో జరిగిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.కర్నూలు నగరానికి చెందిన జాతీయ స్థాయి యోగా భూషణ్ అవార్డు గ్రహీతలైన
యోగా గురువులు అవినాష్ శెట్టి,డాక్టర్ ఎస్ ముంతాజ్ బేగం లను జిల్లా కలెక్టర్
సెట్కూర్ సీఈఓ డాక్టర్. వేణుగోపాల్ ,జెడ్పి సీఈవో నాసర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి అవినాష్ శెట్టి,డాక్టర్ ప్రసాద్,
ముని స్వామి,జిల్లా యోగ సంఘం సభ్యులు గణేష్,
లు పాల్గొన్నారు.