కోటేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన పాఠశాల సిబ్బంది.

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం 
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటేకల్ గ్రామం లో పనిచేసే వివిధ ప్రాంతాలకు బదిలీ మరియు ప్రమోషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులను సన్మానించిన పాఠశాల 4మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది. బదిలీపై వెళ్లిన  ప్రధానోపాధ్యాయులు  భీమన్న  మరియు ఉపాధ్యాయులు లక్ష్మన్న, గణపతి, మల్లికార్జున రెడ్డి, పద్మావతి, శ్రీధర్,హసీనా, వీరభద్రప్ప,ఉమాపతి, సునీత రెడ్డి, ప్రమీల ఉపాధ్యాయులను పాఠశాల బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు  భీమన్న  మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీలు సాధారణం మనం అంకితభావంతో పనిచేసి ఎక్కడైనా మంచి పేరు ప్రఖ్యాతి గడించి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడమే మన ఉన్నత లక్ష్యం మనమందరం ఎక్కడ ఉన్నా పిల్లల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి కోటేకల్ గ్రామ పెద్దలు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మరియు పూర్వ విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించి వీడ్కోలు చెప్పారు