*సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి*
*ఆర్ ఐ ఓ లాలప్ప గారికి PDSU-NSUI ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.*
----------------------------------------------
*అకాడమిక్ ప్రారంభంలోనే సెలవు రోజుల్లో తరగతులను నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పెట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) రాష్ట్ర నాయకులు రమణ కుమార్ (ఎన్ ఎస్ యు ఐ ) జిల్లా ఉపాధ్యక్షులు సాయికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.*
*కర్నూల్ నగరంలో సెలవు దినములో, అధిక తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు పై చర్యలు తీసుకోవాలని ఆర్ ఐ ఓ గారిని కోరారు.*
*ఈ సందర్భంగా రమణ కుమార్, సాయికుమార్ యాదవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కళాశాలలు నడుపుతున్న,*
*ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధిక ఫీజులలు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగల తొక్కుతూ ధనమే ధ్యేయంగా విద్యాసంస్థలు నిర్వహిస్తున్న విద్యాధికారులు ఏమాత్రం పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు.*
*సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులకు క్రీడలు, మానసిక వికాసం లేకుండా తరగతి గదిలో ఖైదీలగా బంధిస్తూ నిర్బంధ విద్యను అమలు చేస్తున్న ప్రవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.* *సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు*.
*ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నగర ఉపాధ్యాయులు అస్లాం భాష, ఎన్ఎస్ యు ఐ నాయకులు నవదీప్ తదితరులు పాల్గొన్నారు.*