నేడు ఎన్.టి.ఆర్.భరోసా పింఛన్లు పంపిణీ*


*నేడు ఎన్.టి.ఆర్.భరోసా పింఛన్లు పంపిణీ*

*జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వెల్లడి*

పార్వతీపురం, జూలై 31 : V3tv న్యూస్ మీడియా
ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ తవిటి రాజు
జిల్లావ్యాప్తంగా నేడు ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లు పంపిణీ కానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. *పేదల సేవలో* భాగంగా జిల్లాలోని 1,40,672 మందికి రూ.60,10,27,500/- నిధులను ఎన్. టి.ఆర్. భరోసా పింఛన్లు కింద పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఇందులో కొత్తగా మంజూరుకాబడిన 1,634 మంది వితంతువు పింఛన్లు ఉన్నట్లు చెప్పారు. కొత్తగా మంజూరైన పింఛన్లలో పార్వతీపురం నియోజకవర్గంలో 427, కురుపాంలో 458, సాలూరులో 302, పాలకొండలో 447 ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. ఒకటవ తేదీ ఉదయం 6.00గం.లకు పింఛన్ల పంపిణీ ప్రారంభం అవుతుందని తెలిపారు. మొదటి రోజునే శత శాతం పింఛన్లు పంపిణీకి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్లు కింద వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, కదలలేని స్థితిలో ఉన్నవారికి, కళాకారులకు తదితర అన్ని రంగాలకు చెందిన వారికి కనీస పింఛను నాలుగు వేల రూపాయలు కాగా గరిష్టంగా పదిహేను వేల రూపాయల వరకు అందించడం జరుగుతుందని అన్నారు. 

*మండలాల వారీగా పింఛన్ల వివరాలు ఇలా ఉన్నాయి*

కురుపాం మండలంలో 6,789 పింఛన్లకు గాను రూ.28.57 లక్షలు, పాలకొండలో 7,249 (రూ.30.27 లక్షలు), మక్కువ 8,329 (రూ.36.68 లక్షలు), సీతానగరం 11,135 (రూ.47.31లక్షలు), పార్వతీపురం (అర్బన్) 5,417 (రూ.23.98 లక్షలు), పార్వతీపురం 10,763 (రూ.46.14 లక్షలు), సీతంపేట 7,961 (రూ.32.93 లక్షలు), భామిని 6,892 (రూ.29.80 లక్షలు), జియ్యమ్మ వలన 8,828 (రూ.38.02 లక్షలు), గుమ్మలక్ష్మీపురం 6,549 (రూ.27.09 లక్షలు), సాలూరు 8,240 (రూ.35.14 లక్షలు),బలిజిపేట 10,676 (రూ.45.93 లక్షలు), గరుగుబిల్లి 8,090 (రూ.34.07 లక్షలు), పాలకొండ (అర్బన్) 3,371 (రూ.14.56 లక్షలు), పాచిపెంట 6,699 (రూ.28.54 లక్షలు), వీరఘట్టం 9,707 (రూ.41.63 లక్షలు), సాలూరు (అర్బన్) 5,680 (రూ.24.62 లక్షలు), కొమరాడ 8,297 (రూ.35.66 లక్షలు) పంపిణీ కానుందని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు. 

మండల ప్రత్యేక అధికారులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించి నివేదికను అందజేయాలని తెలిపారు. పబ్లిక్ పర్సెప్షన్ లో జిల్లా ముందంజలో ఉండేలా అధికారులు కృషి చేయాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.