*సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ*
పార్వతీపురం, ఆగష్టు 23: అదనపు జడ్జి, ఫస్ట్ క్లాస్ క్లాస్ మేజిస్ట్రేట్ జె. సౌమ్య జోసెఫిన్ శనివారం స్థానిక సబ్ జైల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. జైలులో వసతులను పరిశీలించారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి పరిస్థితులు పట్ల ఆరా తీశారు. నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. చక్కటి నడవడిక, నైతిక విలువలు వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. జైలు రికార్డులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. జైలు లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను తనిఖీ చేశారు. జైలులోని పలు విభాగాలను పరిశీలించారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ గురించి ఖైదీలకు వివరించారు. ఒక అడ్వకేట్, ఒక పారాలీగల్ వాలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయసలహాలు అందిస్తారని చెప్పారు. ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తిచేసుకోవాలని జడ్జి సూచించారు. ఖైదీల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలను న్యాయమూర్తి సబ్ జైల్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. 70ఏళ్లు పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడేవారికి బెయిల్ మంజూరయ్యేలా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.