పాత్రికేయ గణపతి సేవలో ... కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ .

పాత్రికేయ గణపతి సేవలో ... జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  . 

గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి .
గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్   తెలిపారు. 
మంగళవారం సాయంత్రం కర్నూలు సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన శేషనాగా గణపతిని  జిల్లా ఎస్పీ  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్   మాట్లాడుతూ...
మట్టి వినాయకుడిని ప్రతిష్టించడం పర్యావరణ పరిరక్షణలో ఒక మంచి సంకేతమన్నారు.  పాత్రికేయ మిత్రులు ఐక్యమత్యంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ప్రశంసనీయమైన విషయన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక స్పృహను కలిపిన ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 
 సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యమని, మట్టి వినాయకుల ద్వారా పర్యావరణానికి మేలు చేకూరుస్తాయన్నారు. 
అదే విధంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని ఎస్పీ  ఆకాంక్షించారు.
అనంతరం  పాత్రికేయ ఉత్సవ గణపతి సమితి సభ్యులు జిల్లా ఎస్పీ ని సత్కరించారు .
ఈ  కార్యక్రమంలో  పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు... మలపల  మంజునాథ్ యాదవ్ , రామకృష్ణ , వెంకట సుబ్బయ్య,  సాయికుమార్ నాయుడు,  కాపు హరినాథ్ రెడ్డి,శ్రీనివాసులు, శ్రీనాథ్ రెడ్డి,అవినాష్ శెట్టి, హరి కృష్ణ, మల్లికార్జున,  గంగాధర్,ఇస్మాయిల్, ఆసిఫ్,రాఘవేంద్ర, మధు, పరమేష్, విద్యాసాగర్, రామకృష్ణ ప్రసాద్ యాదవ్ పరమేష్ విజయ్ మక్బూల్  తదితరులు పాల్గొన్నారు.