గణేష్ ఉత్సవాలు భారతీయ సంస్కృతీ సాంప్రదయాలకు ప్రతీక..... మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి



గణేష్ ఉత్సవాలు భారతీయ సంస్కృతీ సాంప్రదయాలకు ప్రతీక ....
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి 

భారతీయ సంస్కృతీ సాంప్రదాయలకు గణేష్ ఉత్సవాలు ప్రతీక అని, భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వినాయక చవితి పండుగ, విశేషపూజల అనంతరం గణేష్ నిమజ్జనం ఎంతో భక్తి శ్రద్దలతో  నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. 

బుధవారం కర్నూలు నగరంలోని చిన్న అమ్మవారి శాల ఎదురుగా ఉన్న మెంజిన్ బజార్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మహారాజ్ ఉత్సవ విగ్రహంకు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 
మెంజిన్ బజార్ గణేష్ యూత్ సభ్యులు లగిశెట్టి విశ్వనాధం, కిషోర్, ఆనంద్, మంజు, సతీష్, పవన్ లు బైరెడ్డి రాజశేఖరరెడ్డికి ఘన స్వాగతం పలికి పురోహితులచే ఉత్సవ గణనాధునికి విశేషపూజలు చేయించారు. 
ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు భవిష్యత్ తరాల కోసం నేటి యువత కాపాడుకోవాల్చిన బాధ్యత ఉందన్నారు. ఈ పూజల్లో రాయలసీమ ఉద్యమ నాయకులు రాథోడ్ సీమ కృష్ణ, సురేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.