కర్నూలు గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాలి ... కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ .



కర్నూలు గణేష్ నిమజ్జనం  ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాలి ... 

కర్నూలు జిల్లా ఎస్పీ   విక్రాంత్ పాటిల్ .
* సెప్టెంబర్ 4 (గురువారం)న కర్నూలు లో 1200 వినాయక విగ్రహాల నిమజ్జనం.

* 2వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత .

* పోలీసులు అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీగా విధులు నిర్వహించాలి .

* విధుల పట్ల బాధ్యతాయుతంగా  ఉండాలి.

సెప్టెంబర్ 4 వ తేదిన గురువారం  కర్నూలులో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలని  కర్నూలు జిల్లా ఎస్పీ  . విక్రాంత్ పాటిల్  అన్నారు.
ఈ సంధర్బంగా బుధవారం  జిల్లా పోలీసు కార్యాలయ పేరడ్ మైదానంలో బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులు,  సిబ్బందితో జిల్లా ఎస్పీ గార సమావేశమై దిశా నిర్దేశం చేశారు. 
ఈ సంధర్బంగా  జిల్లా ఎస్పీ   మీడియా తో  మాట్లాడారు.
గురువారం కర్నూలులో 1200 గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందన్నారు.
 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 
10 డ్రోన్ కెమెరాలు, 2 వేల  సిసి కెమెరాల నిఘా ఉంచామన్నారు. 
రూఫ్ టాప్, పికెట్స్, స్ట్రైకింగ్ ఫోర్సు  రిజర్వు, ఎపిఎస్పీ  ఫోర్సు,  పుషింగ్ , లిఫ్టింగ్ , స్పెషల్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేశామన్నారు.  
మిలాద్ ఉన్ బీ  పండగ సంధర్బంగా  సెప్టంబర్ 5 వతేది  కూడా పకడ్బందీగా బందోబస్తు  ఏర్పాటు చేశామన్నారు. 
గణేష్ పండుగ నేపథ్యంలో శాంతియుత సమావేశాలు నిర్వహించామన్నారు. 
జిల్లా ప్రజలు సహకరించాలన్నారు. 
అనంతరం పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ  పలు సూచనలు చేసి దిశా నిర్దేశం చేశారు. 
తెలంగాణ లో హైదరాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత ఏపీలో కర్నూల్ గణేష్ నిమజ్జనం కు అంత ప్రాధాన్యత ఉందన్నారు. 
నిమజ్జన ఉత్సవం సంప్రదాయ రీతిలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా  చర్యలు తీసుకోవాలన్నారు.
అందరూ భాద్యతతో పని చేయాలన్నారు. 
 ఎక్కడైనా సమస్యలుంటే  వెంటనే పై అధికారులకు తెలియజేయాలన్నారు. 
నిమజ్జనం ఊరేగింపు వాహనాలలో చిన్నపిల్లలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
శోభా యాత్ర జరిగే రహదారులు, కూడళ్లు,  నిమజ్జనం వేళ ఎలాంటి ఘటనలు లేకుండా నిఘా ఉంచాలన్నారు.
విధుల పట్ల  అలసత్వం ప్రదర్శించ కూడదన్నారు. 
నిమజ్జన ఘాట్ దగ్గర విధులు నిర్వహించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 
నిమజ్జనం పూర్తిగా ముగిసే వరకు విధులు కేటాయించిన స్ధానాల్లోనే ఉండాలన్నారు.
పోలీసులు అత్యత్సాహం ప్రదర్శించకుండా భాద్యతగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. 
గణేష్  నిమజ్జన కార్యక్రమంలో భక్తులు , ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యహరించాలన్నారు. 
బందోబస్తు విధులలో  ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 11 మంది డిఎస్పీలు, 71 మంది సిఐలు మరియు ఆర్ ఐలు , 143 మంది ఎస్సైలు, 358 మంది ఎఎస్సై మరియు హెడ్ కానిస్టేబుల్స్  , 628 మంది పోలీసు కానిస్టేబుల్స్ , 55 ఎఆర్ సెక్షన్లు,  29 మంది మహిళా పోలీసులు, 66  స్పెషల్ పార్టీ పోలీసులు, 1 ప్లటూన్ ఎస్ డి ఆర్ ఎఫ్, 5 ప్లటూన్ ల  ఏపీఎస్పీ బృందాలు,  405 మంది హోంగార్డులను మొత్తం 2 వేల మంది  పోలీసులను  మోహరింపజేశామన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్   డిఎస్పీలు సిఐలు, ఆర్ ఐలు , ఎస్సైలు , ఆర్ ఎస్సైలు,  సివిల్, ఎఆర్, ఎపిఎస్పీ, స్పెషల్ పార్టీ ,  హోంగార్డ్సు, కర్నూలు జిల్లా తో పాటు నంద్యాల, కడప, అన్నమయ్య  జిల్లాల వారు ఉన్నారు.