ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ...
ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ .
• ప్రతి ఒక్కరూ వ్యాయమాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
• జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించిన పోలీసు అధికారులు.
• ప్రతి ఆదివారం పోలీసులు , ప్రజలు సైక్లింగ్‌ను అలవాటుగా చేసుకుని శారీరక దృఢత్వం , ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం.
ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద Sunday’s on Cycle కార్యక్రమాన్ని ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సంధర్బంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ గారు మాట్లాడుతూ…
• ప్రతి ఆదివారం పోలీసులు , ప్రజలు సైక్లింగ్ లో పాల్గొనే విధంగా చేయడమే ఈ కార్యక్రమమన్నారు.
వాహన కాలుష్యాన్ని తగ్గించడం పర్యావరణ స్థిరత్వానికి దోహదపడటం ఎంతో ముఖ్యమన్నారు.
ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని, అది వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబానికి మేలు చేస్తుందన్నారు.
సైక్లింగ్ ద్వారా పర్యావరణానికి హాని కలగదన్నారు. వ్యాయమాల ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
ఈ సైకిల్ ర్యాలీ కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయం గేట్ ముందు ( కొండారెడ్డి బురుజు) నుండి ప్రారంభమై ఓల్డ్ కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్ మీదుగా రాజ్ విహార్ కు , అక్కడి నుండి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం కు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ తో పాటు ఆర్ ఐ నారాయణ , ఆర్ ఎస్సైలు, ఏ ఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు