కర్నూలు లో గణేష్ నిమజ్జనం ను , నిమజ్జనం శోభా యాత్ర ను పరిశీలించిన …. జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ .



కర్నూలు లో గణేష్ నిమజ్జనం ను , నిమజ్జనం శోభా యాత్ర ను పరిశీలించిన …. జిల్లా కలెక్టర్  రంజిత్ భాషా ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్   .

కర్నూల్ లో  వినాయక నిమజ్జనోత్సవం... 
భధ్రత ఏర్పాట్ల ను పర్యవేక్షించిన ... జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ .
గణేష్ నిమజ్జనం సందర్భంగా మొదటగా కర్నూల్, రాంబొట్ల దేవాలయ గణేష్ విగ్రహాన్ని జిల్లా  కలెక్టర్  రంజిత్ భాషా , జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  , మరియు  ప్రజా ప్రతినిధులుదర్శించుకొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు .
పాతబస్తీలో నిమజ్జనం శోభా యాత్రను జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ   కాలినడకన పర్యటించి పరిశీలించారు.
భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
పోలీసు అధికారులకు  జిల్లా ఎస్పీ  పలు సూచనలు చేశారు.
గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
వినాయక నిమజ్జనం పూర్తీ అయ్యేవరకు  అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇతర శాఖ అధికారుల సమన్వయంతో  నిమజ్జనం కార్యక్రమo సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వినాయక నిమజ్జన ఘట్టాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 
జిల్లా కలెక్టర్,  జిల్లా ఎస్పీ  వెంట సిఐలు తేజోమూర్తి,  రామయ్య నాయుడు, మన్సురుద్దీన్,  స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు వేణుగోపాల రాజు, ఖాజావలి  ఉన్నారు.