దసరా సెలవులను 22వ తేదీ నుండి ప్రకటించాలి డిటిఎఫ్

దసరా సెలవులను 22వ తేదీ నుండి ప్రకటించాలి 

దసరా సెలవులను సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య నుండి ఇస్తున్నట్లుగానే అనగా ఈనెల 22వ తేదీ నుండి దసరా సెలవులు ప్రకటించాలని డిటిఎఫ్ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు డిటిఎఫ్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప  అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కరే కృష్ణ ,
జిల్లా శాఖ అధ్యక్షులు 
విజి వెంకటరాముడు,
 రాష్ట్ర కౌన్సిలర్ గోట్ల చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి గంగాధర్,రోషన్న, బీపీ రంగస్వామి, బందే నవాజ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ ఉన్నందున మరుసటి రోజు ప్రయాణం చేయడానికి వీలుగా అక్టోబర్ మూడో తేదీ కూడా సెలవును ప్రకటించాల్సిందిగా డిటిఎఫ్ డిమాండ్ చేస్తున్నది. ఉపాధ్యాయులకు చెల్లించవలసిన డిఎ లను ఇవ్వాలని, పాత బకాయిలను చెల్లించాలని, వేతన సవరణ ఆలస్యమవుతున్నందున మద్యంతర భృతి 30 శాతం ఇవ్వాలని డిటిఎఫ్ డిమాండ్ చేసింది. వేతన సవరణ సంఘాన్ని నియమించి కార్యచరణ చేపట్టాలని డిటిఎఫ్ కోరింది. విద్యార్థులకు నిర్వహించే అసెస్మెంట్ విధానాన్ని పున సమీక్షించాలని డిటిఎఫ్ డిమాండ్ చేస్తున్నది.