గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్ :::
కర్నూలు జిల్లా SP గారి ఉత్తర్వుల మేరకు కర్నూలు IV టౌన్ పోలిసు స్టేషన్ పరిధి లో గంజాయి అమ్మడం గాని, రవాణా చేయడం లేదా కొనడం లాంటి కార్యకలాపాలు నిరోదించడంలో భాగముగా కర్నూలు సబ్-డివిజన్ DSP శ్రీ J.బాబు ప్రసాద్ గారి అధ్యక్షతన లో గంజాయి ఒరిస్సా- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుండి నుండి పెద్ద మొత్తంలో గంజాయి కర్నూలు కు రవాణా చేస్తున్నారనే సమాచారం రాగా పై అధికారులకు తెలుపు కొని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, కల్లూర్ తహసిల్దార్ శ్రీ ఆంజనేయులు గారు, కల్లూర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గార్ల ల సమక్షం లో బళ్లారి చౌరస్తా దగ్గర గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద కర్నూల్ నాలుగో పట్టణ సిఐ విక్రమ్ సింహ అయిన నేను, శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, SI, హెడ్ కానిస్టేబుల్ ఖాద్రి, షాకీర్, శ్రీనివాసులు, పోలిస్ కానిస్టేబుళ్ళు మురళీధర్, సుబ్బరాయుడు, రాఘవేంద్ర మరియు ఖాజాలతో వెహికల్ చెకింగ్ జరుపుతుండగా, ఒక తెల్లని టయోటా గ్లాంజా కారు AP 40N 3258 రాగా సిబ్బందితో సదరు కారుని ఆపి తనిఖీ చేయగా అందులో ఐదుగురు యువకులు వారిని ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించగా అరకు నుండి వస్తున్నామని తెలుపగా వచ్చిన సమాచారం సరైనదని నిర్ధారించుకున్నాక తర్వాత కల్లూర్ తహసిల్దార్ శ్రీ ఆంజనేయులు గారి సమక్షం లో వారిని ప్రశ్నించగా, జల్సాలకు అలవాటు పడి, కష్ట పడి పని చేసే తత్వం లేక సులభంగా అధిక మొత్తం లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో పై తెలిపిన వ్యక్తులు అందరు కలిసి గురువారం రోజున వెంకటరమణ కాలనీలో నివాసం ఉండే మురళి అనే వ్యక్తికి సంబంధించినటువంటి టొయోట గ్లాంజా కార్ నెంబర్: AP 40 N 3258 రోజుకు 3000 రూపాయలు చొప్పున బాడుగలకి మాట్లాడుకుని గురువారం రోజు పై ఐదు మంది వ్యక్తులు కలిసి సదురు టయోటా గ్లాంజా కార్ లు అరకు వెళ్లి అక్కడ లాడ్జ్ లోని ఒక రూమ్ లో అద్దెకు దిగి ఒరిస్సా సరిహద్దులో సుమారు 18 నుంచి 20 కేజీల గంజాయిని సుమారు Rs 80,000/- ( అక్షరాల ఎనబై వేల రూపాయాలకు) కొనుగోలు చేసి శనివారం అక్కడి నుంచి బయలుదేరి ఈరోజున కర్నూలు వచ్చి సదరు గంజాయిని పొట్లాల రూపంలో మార్చి ఒక్కొక్క పాకెట్ 500 రూపాయలకు అమ్ముకొని సుమారు 4 లక్షల రూపాయలు వరకు సంపాదించుకోవాలని కర్నూలుకు తిరిగి వచ్చామని చెప్పగా సదరు గంజాయిని ఎక్కడ దాచి ఉంచారో అని అడగగా ఎవరికి అనుమానం రాకుండా చెక్ పోస్టుల తనిఖీల్లో బయటపడకుండా సదరు కారు యొక్క నాలుగు డోర్లు లోపల భాగంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ భాగాన్ని ఓపెన్ చేసి ఆ డోర్లలో సదరు గంజాయిని ప్లాస్టిక్ రాపర్లలో చుట్టి దాచుకొని డోర్లను యాదవిధిగా ఫిట్ చేసుకొని వచ్చామని తెలుపగా అందరి సమక్షంలో తనిఖీలు చేయగా రాపార్లతో కలుపుకొని సుమారు 20 కేజీల వరకు ఉన్నటువంటి గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకొని, సదరు గంజాయి రవాణాకు వినియోగించినటువంటి టయోటా గ్లాంజా కారును సీజ్ చేసి పై ఐదుగురిని రెవెన్యూ అధికారుల, పెద్దమనుషుల సమీక్షలో అరెస్ట్ చేయడం జరిగింది. వీరితో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి కూడ దర్యాప్తు లో భాగముగా విచారణ జరుగుతున్నది.
ఆరెస్టు కాబడిన ముద్దాయిల పేర్లు
1. మీనుగ నరేంద్ర, మాదన్న నగర్ పంచలింగాల, కర్నూలు
2. నల్లగొట్టి ఉమేష్ చంద్ర, ధర్మపేట కర్నూలు
3. సిరిగిరి మృత్యుంజయ రెడ్డి, ఎస్ ఎస్ నగర్, జిల్లా కోర్టు సమీపాన, కర్నూలు
4. షేక్ మహమ్మద్ ఆరిఫ్, ఎస్బీఐ కాలనీ, కర్నూల్
5. పగిద్యాల చాకలి గోవర్ధన్, కొత్తపేట, కర్నూలు
పోలిస్ వారి విజ్ఞప్తి
పోలీసు వారి తరఫున తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏమనగా దయచేసి పిల్లలు కదలికల పైన నిఘా ఉంచండి. ఎవరైనా ఇలా గంజాయి కి అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండండి, అలా అలవాటు పడేవారు ఉంటే వారిని గుర్తించి మాకు తెలియపరచగలిగితే డి అడిక్షన్ సెంటర్లకు వారిని పంపించి సదురు అలవాటు నుంచి దూరం చేసే విధంగా ప్రయత్నిస్తాము మీ పిల్లలే మీ భవిష్యత్తు కాబట్టి వారు ఏదైనా చెడు అలవాట్లకు బానిసలుగా మారితే వారి భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్తు మీ పిల్లలపై పెట్టుకున్న ఆశలు కూడా కూడా అంధకారం అవుతుంది తస్మాత్ జాగ్రత్త....