విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తు శిల్పిగా భావిస్తారని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా , ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కోన్నారు.
సెప్టెంబర్ 17 న విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ చిత్ర పటానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా , ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడుతూ...
కష్టపడే తత్వం, పట్టుదల, నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చనే శక్తివంతమైన సందేశాన్ని విశ్వకర్మ ద్వారా మనం నేర్చుకోవచ్చన్నారు.
విశ్వకర్మ జయంతి సంధర్భంగా శిల్పకారులు , కళాకారులందరూ విశ్వకర్మను తమ ప్రేరణగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు.
వివిధ వృత్తులలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి వెనుక ఉన్న ప్రేరణే విశ్వకర్మ అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలతో పాటు ఎఆర్ డిఎస్పీ భాస్కర్ రావు, ఆర్ ఐలు జావేద్, నారాయణ, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.