పాణ్యం నియోజకవర్గ పరిధిలోని,పాణ్యం మండలం MPDO ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం లో ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి

పాణ్యం నియోజకవర్గ పరిధిలోని,పాణ్యం మండలం  MPDO  ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాణ్యం శాసనసభ్యురాలు,మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట స్త్రీ శిశు సంక్షేమం,వికలాంగులు మరియు వృద్ధుల కమిటీ చైర్ పర్సన్  శ్రీమతి గౌరు చరితరెడ్డి  ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ..పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని,ప్రజల క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాణ్యo మండల ZPTC, MPP, ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్  పాణ్యo మండల తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి ,మండలంలోని పలువురు సర్పంచులు,ఎంపీటీసీ లు, సంబంధిత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.