సులువుగా డబ్బు లు సంపాదించాలని సోషల్ మీడియాలో వీడియో కాల్స్ తో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు అరెస్ట్ చేసిన కర్నూల్ పోలీసులు



సులువుగా డబ్బు లు సంపాదించాలని సోషల్ మీడియాలో వీడియో కాల్స్ తో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులు.

తక్కువ ధరకే పొలాలు అమ్ముతామని మోసాలు.కర్నూల్ టూ టౌన్ పిఎస్ లో నిందితుల వివరాలు వెల్లడించిన.... కర్నూల్ టూ టౌన్ సీఐ నాగరాజరావు.మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కర్నూలు 2 టౌన్ PS, కర్నూలు Cr.No.237/2025 U/s 308(5), 318(4), 61(2)(a) R/W 3(5) dated: 13.09.2025 
ముద్దాయిలు:
(1) చిక్కిరి మల్లేశ్, వయస్సు 27 సం,, తండ్రి పేరు చిక్కిరి సత్తయ్య, ఇంటి నంబరు-3-138, బలరాం నగర్, కల్వకుర్తి టౌన్ మరియు మండలము, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రము,   (2) పెరుమాళ్ల మేరీ, వయస్సు 26 సం,, భర్త పేరు చిక్కిరి మల్లేశ్, తండ్రి పేరు పెరుమాళ్ల రామస్వామి, H.NO. 3-138, బలరాం నగర్, కల్వకుర్తి గ్రామము మరియు మండలము, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రము, 
(3) మొల్గరి మల్లిక @ లిల్లీ, వయస్సు 33 సం,, భర్త: మొల్గరి మల్లేశ్, సొంత ఊరు కమ్మ గూడెం, మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా, ప్రస్తుతము కల్వకుర్తి గ్రామము మరియు మండలము, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రము 
పై తెలిపిన ముద్దాయిలు అందరూ కలిసి, అక్రమంగా డబ్బులు సంపాధించాలనే కుట్ర పన్ని, సంయుక్తరెడ్డి పేరుతో ఒక Twitter అక్కౌంట్ ఓపెన్ చేసి, న్యూడ్ వీడియో కాల్స్ పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ, అలాగే కర్నూలు టౌన్ లోని ఒక వ్యక్తిని కూడా ట్రాప్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడి, విలువైన పొలాలు తక్కువ దరకే అమ్ముతాము అని నమ్మించి పలు దఫాలుగా ఫిర్యాది ని మరియు అతని కుటుంబ సభ్యులను చంపుతాము అని బెదిరించి, బలవంతంగా ఫిర్యాది నుండి సుమారుగా రూ.3,80,00,000/- (అక్షరాల మూడు కోట్ల ఎనబై లక్షల రూపాయలు)  అక్రమ వసూళ్లు చేసుకుని, అందులో నుండి రూ.41,26,000/- (అక్షరాల నలబై ఒక్క లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు) విలువ కలిగిన రెండు కార్లు, ఒక మోటార్ సైకల్ మరియు బంగారు ఆభరణాలు వస్తువులను కొని, మిగిలిన డబ్బులు రూ.33,874,000/- (అక్షరాల మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు) లను ముగ్గురు కలిసి జల్సాలకు వాడుకున్నారు.పై తెలిపిన ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడము అయినది. కావున ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు రెండవ పట్టణ పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.