ప్రభుత్వం ఉల్లి రైతులకు నగదు సహాయం అందించాలని నిర్ణయించడం పై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
....ధరలు లేక నష్టపోతున్న ఉల్లి రైతులకు నగదు సహాయం ఊరటనిస్తుంది
...గత వైసీపీ ప్రభుత్వం నష్టపోయిన ఉల్లి రైతులను పట్టించుకోలేదు
....రైతుల కష్టాలు తెలియని జగన్ నాడు మాటలకే పరిమితం అయ్యాడు
...ఉల్లి రైతులను ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు...ఎంపీ బస్తిపాటి నాగరాజు
ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నగదు సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు..ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా సీఎం చంద్రబాబు కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు...ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ఉల్లికి ధరలు లేక నష్టపోతున్న రైతులకు నగదు సహాయం భారీగా ఊరటనిస్తుందన్నారు... ఉల్లి రైతులకు అండగా ఉండేందుకు కిలో రూ.12కి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటంతో పాటు , రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వం పై భారం పడుతున్నప్పటికి ఉల్లి పండించి నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోసం వెనకడుగు వేయకూడదని స్పష్టం చేసిందన్నారు.. ఇక గత వైసీపీ పాలనలో అనేక సార్లు ఉల్లి ధరలు పతనమయ్యాయని, అయితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఉల్లి రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు...రైతుల కష్టాలు తెలియని జగన్ నాడు మాటలకే పరిమితమై అన్నదాతలను నిలువునా ముంచాడని మండిపడ్డారు...కూటమి ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తుందని, రైతు శ్రమకు గౌరవించి వారికి న్యాయమైన ధరలు రావడానికి కృష చేస్తుందని ఆయన తెలిపారు.