ఓర్వకల్ మండలంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు వృత్తి విద్య కోర్సులలో భాగంగా IT/ITES లోని లెవెల్-2,& 3,4( పదవ తరగతి) (ఇంటర్ ) విద్యార్థులు కళాశాల నందు లెవెల్-2 ఐటి విద్యార్థులకు యూనివర్సల్ కంప్యూటర్ సర్వీసెస్ నందు 10 రోజులు ఇంటర్సిప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి జోషిల్లా వాట్స్ , GCDO స్నేహ లత , ఒకేషనల్ కోఆర్డినేటర్ విక్రాంత్, ప్రశాంత్ సందర్శించి మాట్లాడుతూ ఇటువంటి శిక్షణల వలన విద్యార్థులలో వృత్తి యందలి నైపుణ్యం మరియు అనుభవ పూర్వక జ్ఞానం పెంపొందించుకుంటారని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఐటీ ఒకేషనల్ ట్రైనర్ చరణ్ సాయి ని ప్రత్యేకంగా అభినందించారు.
ఓర్వకల్లు ఆదర్శ పాఠశాల విద్యార్థులు వృత్తి విద్య కోర్సులలో ప్రతిభ
October 02, 2025