*సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి బి.వెంకట స్వామి*
------------------------------------
దేశ ప్రధాని మోడీ కర్నూలు పర్యటనను ప్రజలు వ్యతిరేకించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి బి. వెంకటస్వామి పిలుపునిచ్చారు.
కర్నూలు నగరంలో గోకారి భవన్ నందు ప్రజాసంఘాల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 15వ తేదీన జరుగు నిరసన ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మోడీ గారి ప్రభుత్వం 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్రానికి గాని మన జిల్లాకు గాని ఎటువంటి లాభం చేకూరాలేదని ప్రతి బడ్జెట్లోనూ మనకు మొండి చెయ్యి చూపించే తప్ప మనకు తగిన ప్రాధాన్యత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇవ్వలేదని ఆ రకంగా కుట్రలు పన్నారని వారు వివరించారు. తిరుపతిలో తిరుమల వెంకన్న సాక్షిగా బహిరంగ సభలో 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తామని అది కూడా 15 సంవత్సరాల వరకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన మోడీ ,షాలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి శఠగోపం పెట్టిన ఘనత వీరిదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలోని ఎన్ డి ఏ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పిన బిజెపి నాయకులు ఎందుకు అమలు చేయలేదని వారు ప్రశ్నించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏది అని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేస్తాం అంటున్నారు ఇదేనా మీరు మాకు చెప్పే దేశభక్తి అని వారు ప్రశ్నించారు. ఈ జిల్లాకు రాష్ట్రానికి మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అని వారు ప్రశ్నించారు. అన్ని రకాలుగా కర్నూలు జిల్లా కి మొండి చేయి ఇచ్చారని ఎద్దేవా చేశారు అమరావతి రాజధాని అభివృద్ధి కోసం చెంబు నీళ్లు ,గుప్పెడు మట్టి ఇచ్చిన సంగతి గుర్తుందని వారు వివరించారు. 16 నెలలలో మీరు నాలుగు సార్లు మా రాష్ట్రానికి వచ్చారని రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చారని రాష్ట్రానికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని అన్నారు. విద్యా వ్యవస్థను కాసాయికరణ, ప్రైవేటీకరణ చేయడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారని ఇది దేశ విద్యారంగానికి పెనుప్రమాదమని అన్నారు. కావున ఈనెల 16వ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పర్యటనను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.భాస్కర్, జోహలపురం రాజు, సురేష్ నాయక్, మహేంద్ర, రమణ, రవి, తిరుపాల్, ఓబులేష్ మొదలైన వారు పాల్గొన్నారు.