*అఖిల భారత విద్యా హక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులుగా కె.భాస్కర్*
అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులుగా పీ డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు కె .భాస్కర్ ఎన్నిక కావడం జరిగిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షుడు రమణ తెలిపారు.
అఖిల భారత విద్యా హక్కువేదిక జాతీయ కౌన్సిల్ సమావేశాలు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో గదర్ పార్టీ కాన్ఫరెన్స్ హల్ నందు అక్టోబర్ 10 నుండి 12 వరకు నిర్వహించబడ్డాయి. ఏఐఎఫ్ ఆర్టీఈ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి భాగస్వామ్య సంఘాలు పీ డీ ఎస్ యూ నుండి రాష్ట్ర అధ్యక్షులు కె .భాస్కర్ ఎన్నికయ్యారు. అదేవిధంగా కర్నూలు జిల్లా వాసి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జీ. హృదయ రాజు సార్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక పట్ల కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో విద్య పై అనేక తీర్మానాలు చేశారు. విద్య కేంద్రీకరణ, విద్యాలయాలలో మత తత్వ విధానాల ప్రవేశాన్ని అపాలని, విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని, తరగతులకు సిలబస్ తయారీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని, లోపభూయిష్టమైన జాతీయ విద్యా విధానంలో అనేక సవరణలు చేయాలని కోరారు. విద్యారంగ సంస్కరణల కోసం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐఎఫ్ ఆర్టీఈ జాతీయ కౌన్సిల్ లో తీర్మానం చేసినట్లు తెలిపారు.