రూ.13 వేల లంచం పుచ్చుకుంటూ అడ్డం బుక్...
బిల్లు ఫైలు క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్...
వల పన్ని ఏఈని పట్టుకున్న ఏసీబీ అధికారులు..
పత్తికొండ అక్టోబర్ 18(వి 3 న్యూస్ ) దీపావళికి ముందే తుగ్గలి ఎంపీడీవో కార్యాలయంలో అవినీతి బాంబులు పేలాయి. వరుసగా ఎక్కడో ఒకచోట ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కుతున్నా అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. పత్తికొండ లోని పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ కార్యాలయం లో లంచం తీసుకుంటూ ఓ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రెడ్ హ్యాండెడ్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఆర్డబ్ల్యుసిఏఈ నరేష్ తుగ్గలి ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరు గా ప చేస్తున్న ఏఈ నరేష్ రూ 13 వేల లంచం పుచ్చుకుంటూ ఏసీ అధికారులకు పట్టుబడ్డాడు. ఎస్సీ కాలనీకి గ్రావెల్ రోడ్ బిల్లుల ఫైల్ క్లియరెన్ కోసం తుగ్గలి గ్రామానికి చెందిన ఎంపిటిసి రాజు ను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేష్ యం బుక్ రికార్డు చేయాలంటే రూ 13 వేలు డబ్బు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా డబ్బులు ఇస్తేనే రికార్డు నమోదు చేస్తానని చెప్పాడు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ .రోడ్డు వర్క్ చేసి ఏడాదై గా ఎం బుక్ రికార్డు చేయక న్యాయబద్ధంగా చేయాల్సిన పని అనవసర తత్సరం చేస్తూ వేధించినట్లు తెలుస్తోంది. దీంతో విసిగిపోయిన బాధితుడు ఆర్డబ్ల్యూఎస్ ఏఈకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం పక్క ప్లాన్ ప్రకారం ముందుగానే ఎంపీటీసీ రాజుకు ఏసీబీ అధికారులు కరెన్సీ నోట్లకు రసాయనాలు పూసి బాధితుడు చేతికి ఇచ్చారు.ఆ కరెన్సీనోటను తీసుకెళ్లి బాధితుడు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేష్ కు అందజేశారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ కృష్ణారెడ్డి బృందం, ఏఈ నరేష్ ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కాడు.అనంతరం పట్టుబడిన అవినీతి అధికారిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.విషయం స్థానికంగా పెద్ద సంచలనం అయ్యింది.. లంచాలకు రుచి మరిగిన అవినీతి అధికారుల వెన్ను లో వణుకు మొదలయ్యింది.లంచం ఏ ఉద్యోగి డిమాండ్ చేసిన కఠిన చర్యలు తప్పవని ఏసీబీ డిఎస్పి కృష్ణారెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచo డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచుతామని అన్నారు.
ఫోటో రైట్ అప్. ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ నరేష్. అక్టోబర్ 18.