విపక్ష నేతలపై బైండోవర్ కేసులు పెడుతున్నారన్న పయ్యావుల

 


టీడీపీ సీనియర్ నేత  పయ్యావుల కేశవ్ నేడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనాను కలిశారు. విపక్ష నేతల మీద బైండోవర్ కేసులు పెడుతుండడంపై ఫిర్యాదు చేశారు. ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పయ్యావుల వివరించారు. 


ఎన్నికల ప్రచారం చేసే టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరులపై సస్పెక్ట్ షీట్ తెరుస్తామని బెదిరిస్తున్నారని, పోలింగ్  రోజు పోలీస్ స్టేషన్ లో ఉంచుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఈవోకు ఫిర్యాదు చేశారు. 

అదే సమయంలో, వైసీపీకి చెందినవారిపై రౌడీషీట్లు ఎత్తివేశారని పయ్యావుల కేశవ్ సీఈవో దృష్టికి తీసుకెళ్లారు.