ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.
ఈ ఘటన బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగింది. ఘటనాస్థలి నుంచి భద్రతా దళాలు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురు నక్సలైట్ల వివరాలను అధికారులు వెల్లడించలేదు.
ఇదిలాఉంటే.. నాలుగు రోజుల క్రితం కూడా ఛత్తీస్‌గఢ్‌లోని చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో కూడా ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.