గీత ప్రచారాన్ని అడ్డుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు


 పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు షాక్ తగిలింది. ఎన్నికల అధికారులు ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారని అధికారులు ప్రశ్నించారు. ప్రచారానికి సంబంధించిన అనుమతి పత్రాలు ఉంటే చూపించాలని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అడిగారు. దీంతో, ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. పిఠాపురంలోని 2, 3, 4 మున్సిపల్ వార్డుల్లో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. గత వారం రోజులుగా వైసీపీ ముమ్మర ప్రచారం చేస్తోంది. 


మరోవైపు ప్రచారం సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ... పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ కాపు అయితే, తాను కూడా కాపేనని అన్నారు. పవన్ కాపు కావచ్చు కానీ... తోపు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిఠాపురం టికెట్ తనకు కేటాయించడం తన అదృష్టం గా భావిస్తున్నానని చెప్పారు. పిఠాపురం ప్రజలతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని అన్నారు. పిఠాపురంలో తన గెలుపు ఖాయమని చెప్పారు.