చిన్నారి వాల్మీకి వసంతని అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి!
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-నంద్యాల జిల్లా పగిడియాల మండలం మచ్చుమర్రి గ్రామంలో ఈనెల 7వ తేదీన ఆదివారం రోజు ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఐదో తరగతి చదువుతున్న వసంతి అని తొమ్మిది సంవత్సరాల అమ్మాయి *వాల్మీకి వసంత* అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తీసుకొని పోయి అత్యాచారం చేసి. పాప తల్లిదండ్రులకు చెప్తానని భయంతో వసంతిని హత్య చేసి పక్కనే ఉన్న కాలువలో వేయడం అమానుషమని. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన యువకుల ముగ్గురిని పోలీసులు కఠినంగా శిక్షించాలి అని మహిళా సమైక్య ఆధ్వర్యంలో హాలహరి మండలం ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది రాయలసీమ జిల్లా జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ గ్రామానికి పోయి తక్షణమే ఆ కుటుంబాన్ని సందర్శించాలి సిపిఐ యం యల్ లిబరేషన్ ఆలూరు నియోజకవర్గం బోయ మునిస్వామి అన్నారు, అలాగే ముగ్గురు నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు *ఈ ప్రభుత్వం రాష్ట్ర హోం మంత్రి గారు బాధిత కుటుంబాని పరామర్శించి 10 లక్షల ఆర్థిక సహాయం ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకుంటారని రాష్ట్రమంతా ఆందోళన నిర్వహిస్తున్న ప్రజా సంఘాలు హోంశాఖ మంత్రివర్యులు ఇంతవరకు వాల్మీకి వసంతి ఏమాత్రం కూడా తెలిసి తెలియకుండా ఉండడం మంచిది కాదన్నారు ఇలాగే నిమ్మకు నీరతి నట్లు వివరిస్తే ఆందోళన చేస్తాం,లేదంటే రాష్ట్రమంతా పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన జరుగుతాయని అన్నారు,