కర్నూలు జిల్లా కార్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను శిక్షణ మరియు డెవలప్మెంట్ గురించిన కార్యక్రమం
V3 టీవీ న్యూస్ జూలై 12:-
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కార్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను శిక్షణ మరియు డెవలప్మెంట్ గురించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర శిక్షణాధికారిణి కుమారి . ఉమాదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ సామ్యూల్ పాల్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను డెవలప్మెంట్ వైపునకు నడుపుట గురించి యూనిఫాం గురించి శిక్షణ గురించి అడల్ట్ శిక్షణా మరియు పలు రకాల అంశాల గురించి చర్చించి స్టేట్ కు పంపించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ASOC లియో ఆంటోనీ RSL చిన్నయ్య DOC శేఖర్ DTC ఉక్కుమ్ సింగ్ DOC గైడ్స్ సృజన DTC (G) ఫర్జానా కాతున్ ADC(S) శుభానంద్ రావు ADC(G) నాగమణి ADC(G) విగ్నేష్ పాల్గొన్నారు.