తొలగిన అవరోధం.. వెడల్పుకు మోక్షం*

*తొలగిన అవరోధం.. వెడల్పుకు మోక్షం*
V3టీవీలో కర్నూలు టౌన్:
• మంత్రి టి.జి. భరత్ చొరవతో బుధవారపేట మలుపు వద్ద వెడల్పుకు చర్యలు  

నగర‌ పాలక సంస్థ;
12-07-2024
శుక్రవారం 

నగరంలోని 209వ సర్వే నెంబర్ రహదారి పరిధిలో బుధవారపేట మెడికల్ కాలేజీ గేటు వద్ద మలుపు, దాదాపు దశాబ్ద కాలంగా ప్రమాదకరంగా మారిన సంగతి తెలిసిందే. వాహనదారులకు ట్రాఫిక్‌తో ఇబ్బంది కలగడంతో పాటు పలుమార్లు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ విషయమై ఇటివల నగరపాలక అధికారుల సమీక్షలో వెడల్పుకు చర్యలు తీసుకోవాలని మంత్రి టి.జి. భరత్ ఆదేశించారు. దీంతో శుక్రవారం నగర పాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజ మలుపును పరిశీలించి, షాపుల యజమానులతో మాట్లాడారు. రహదారి మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 అడుగులు ఉండగా, అక్కడ 100 ఆడుగుల రహదారి మాత్రమే ఉన్నట్లు కమిషనర్ గుర్తించారు. మలుపు వెడల్పుకు అవసరమైన 7 షాపులను తొలగించి, వారికి తగిన ప్రత్యామ్నాయ మార్గాలు చూపి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఆర్అండ్‌బి, రెవెన్యూ, నగరపాలక పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు సమన్వయంతో మలుపు వెడల్పుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిసిపి సంధ్యారాణి, ఏసిపి రంగస్వామి పాల్గొన్నారు.