డెంగీ వ్యతిరేక మాసోత్సవం పై అవగాహన , దోమల మందు పిచికారి

డెంగీ వ్యతిరేక మాసోత్సవం పై అవగాహన , దోమల మందు పిచికారి

మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీ లక్ష్మి, డాక్టర్ రాగిణిల ఆదేశానుసారం డెంగీ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా స్థానిక ఆదర్శ పాఠశాల ,బాలికల హాస్టల్ నందు, బీసీ హాస్టల్, కస్తూర్బా గాంధీ పాఠశాల నందు మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా డెంగ్యూ వ్యతిరేక మాసొత్సవం పై అవగాహన మరియు  డెంగీ నివారణ చర్యల్లో భాగంగా దోమల మందు పిచికారి చేయడం జరిగింది . అనంతరం మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు మరియు హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు దోమలు కుట్టకుండా  పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని , హాస్టల్ పరిసరాలలో నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలని దోమతెరలు వాడాలని, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని,జ్వరం వచ్చిన వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకొని తగిన చికిత్సలు తీసుకోవాలని సూచించారు. అనంతరం హాస్టల్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను, నీటి నిల్వలను, వాటర్ ట్యాంకుల పైన ఉన్న మూతలను, కిటికీలకున్న మెష్ లను, వాష్ రూమ్ లను, వంటశాలలను పరిశీలించి హాస్టల్ సిబ్బందికి తగిన సలహాలు సూచనలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు, హెల్త్ సూపర్వైజర్ సూర్యనారాయణ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సవిత, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి ,హాస్టల్ వార్డన్ , హెల్త్ సెక్రటరీ అంజలి, సువర్ణ ఆశా కార్య కర్తలు మరియు స్ప్రేయింగ్ సిబ్బంది పాల్గొన్నారు.