జిల్లా అధికారులకు రాష్ట్ర వాల్మీకి న్యాయవాదుల విజ్ఞప్తి
V3 tv news :నంద్యాల జిల్లా పగిడ్డ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బోయ మద్దిలేటి సుజాతల రెండవ కూతురైన బోయ వాసంతి అదృశంపై అధికారులు నిగ్గు తేల్చి స్పందించాలని రాష్ట్ర వాల్మీకి న్యాయవాదుల అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేశారు.గురువారం జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు టి.నాగభూషణం నాయుడు అధ్యక్షతన వాల్మీకి న్యాయవాదులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఐదవ తరగతి చదువుతున్న 9 సంవత్సరాల బోయవాసంతి ఇంతకు జీవించే ఉందా? అదృశ్యంపై తగిన విచారణ జరిపి నిజాలు నెగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మూడు రోజులైనా బోయ వాసంతి అదృశ్యంపై ప్రభుత్వం గానీ, పోలీసులు గాని సరైన సమాచారం ఇవ్వడం లేదని అన్నారు ఇందుకు బాధ్యులైన వారు ఎంతటి వారు అయినా ప్రభుత్వం వదిలిపెట్టకూడదని వారన్నారు.బోయ వాసంతి ఇంతకీ బ్రతికే ఉందా... మరణించిందా? తెలపకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు తీర్మానం చేయడం జరిగిందన్నారు. కావున వెంటనే స్పందించకుంటే భవిష్యత్తు కార్యచరణ ప్రకటించి ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బి.గోపాలకృష్ణ, ఎం.ప్రభాకర్, బి.వీరేష్, సి.ఆనంద్,ఎస్ పద్మజ నాయుడు, చంద్ర ప్రభాకర్, బాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.