జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాలతో.. జిల్లాలో ముమ్మరంగా వాహనాల తనిఖీలుబుధవారము జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు.



జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశాలతో..
 జిల్లాలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

బుధవారము జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. 
జిల్లాలో ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. 
ప్రతి రోజు సాయంత్రం జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీ లు చేపట్టారు. 
ప్రధానంగా రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన చేశారు. 
హెల్మెట్ / సీట్ బెల్టు ధరించాలని, డ్రంకన్ డ్రైవింగ్ లకు దూరంగా ఉండాలని సూచించారు. 
అదేవిధంగా రోడ్డు సేఫ్టీ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు. 
రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు జాగ్రత్తల సూచనలు చేశారు.
 అదేవిధంగా గ్రామాలలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. 
గొడవలకు దూరంగా ఉండాలని, పేకాట , సైబర్ మోసాలు, మహిళలపై నేరాలు, బాల్యవివాహాలు, CC కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత పై అవగాహన చేశారు.
గంజాయి , మత్తు పదార్థాల వలన కలిగే అనార్థాల గురించి ప్రజలకు వివరించారు .
అదేవిధంగా ఎవరైనా పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు సూచించారు.