నీట్‌ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ భద్రత.....జిల్లా కేంద్రంలోని 16 పరీక్ష కేంద్రాల వద్ద 210 మంది పోలీసులతో పటిష్ట భద్రత: జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ .



నీట్‌ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ భద్రత...

జిల్లా కేంద్రంలోని 16 పరీక్ష కేంద్రాల వద్ద 210 మంది పోలీసులతో పటిష్ట భద్రత.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ . 
 
ఆదివారం మే 4న నీట్ యూజీ- 2025 పరీక్ష జరుగుతున్న సంధర్బంగా  కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా  ఆదేశాల మేరకు పకడ్బందీ భధ్రత  ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్   శనివారం  పోలీసు అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రంలో 16 పరీక్షా కేంద్రాల వద్ద నీట్‌ పరీక్ష కు 210 మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించామన్నారు.
నీట్ పరీక్షకు  మొత్తం 4, 466  మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. 
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫ్ లైన్లో విధానంలో పరీక్ష జరుగుతుందని చెప్పారు. 
ప్రతి కేంద్రానికి ఒక సిఐ లేదా ఎస్ఐ స్థాయి పోలీసు అధికారిని నియమించడం జరిగిందన్నారు.
పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS సెక్షన్ విధించి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. 
నీట్ పరీక్షకు వెళ్ళే అభ్యర్థులకు ట్రాఫిక్ వల్ల ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పరీక్ష కేంద్రాల సమీపంలో  జిరాక్స్ షాపులు మూసివేసేలా  చర్యలు తీసుకోవాలన్నారు. 
సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని , పకడ్బందీ  భధ్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్    తెలిపారు.