ఏపీలో వైద్యవిద్య అభివృద్ధికి డా. చంద్రశేఖర్ కృషి చేయాలి - మాజీ ఎంపీ టీజీ వెంకటేష్
కర్నూలు, మే 4 :
రాష్ట్రంలో వైద్యవిద్య అభివృద్ధికి హెల్త్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డా. చంద్రశేఖర్ కృషి చేయాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కోరారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్- ఛాన్సలర్ గా ఇటీవలే నియమితులైన సీనియర్ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన హెల్త్ యూనివర్సిటీ వైస్ - ఛాన్సలర్ పదవి కర్నూలుకు చెందిన వైద్యునికి దక్కడం రాయలసీమ వాసులకు గర్వకారణమని అన్నారు. డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ తన వృత్తిగత జీవితంలో ప్రతి సందర్భంలోనూ టీజీ వెంకటేష్ ఆశీస్సులు తనకు లభించడం తన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సభ్యులు నాగేశ్వరబాబు, వాసుదేవమూర్తి తదితరులు పాల్గొన్నారు.