మైనర్లకు వాహనాలు ఇచ్చినా, మైనర్లు వాహనాలు నడిపినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు .
• మైనర్ల కు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చర్యలు .
• గత 6 నెలలో 640 కేసులు నమోదు.
... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.
జిల్లాలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ వారి వాహనాలకే కాక పక్కవారి వాహనాలకు సైతం ప్రమాదాలు తెచ్చిపెడుతున్న మైనర్ల పై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు.
18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన మైనర్లు ద్విచక్ర వాహనాలు, ఇతర రకాల వాహనాలు నడిపినట్లు గుర్తిస్తే వారిపై మరియు వాహన యజమానులు, వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి ఆపి వారికి మొదటి తప్పిదముగా వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వదిలివేయడం జరుగుతుందన్నారు.
మరలా ఇలాగే వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ. 5 వేలు జరిమానా విధిచడం జరుగుతుందన్నారు.
మరోసారి వాహనం నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు.
మరలా మరలా అదే విధంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకి కారణమైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాక లైసెన్స్ ను జీవితాంతం రద్దు చేయడం జరుగుతుందన్నారు.
మితిమీరిన వేగంతో, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, సైలెన్సర్లు తీసి ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేసి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించినా చట్టప్రకారం వారి పై కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రతి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు వాహనాలు ఇచ్చే సమయంలో వారి వయసుకు తగ్గట్లుగా వారితో మెలగడం మంచిదని, మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలకు కారణమైన మైనర్ల తల్లిదండ్రులు, వాహన యజమానులపై పూర్తి చర్యలు తీసుకోబడతాయన్నారు.
రహదారి ప్రమాదాలను అరికట్టి, ప్రజలందరూ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరాలనే, ప్రజలందరూ జిల్లా పోలీసు వారికి సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
గత 6 నెలలో జనవరి 171 కేసులు , జరిమానా రూ. 91,485. ఫిబ్రవరి 398 కేసులు , జరిమానా రూ. 2,12,930. మార్చి 13 కేసులు, రూ. 65,455. ఏప్రిల్ 9 కేసులు రూ. 45,315, మే 30 కేసులు , రూ. 1,51050. జూన్ 19 కేసులు రూ. 95,665 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ తెలిపారు.