విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా. విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్


విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా. 

విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూల్ జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఆదేశించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో  కర్నూల్ పోలీసులు విజిబుల్ పోలీసింగ్ లో  భాగంగా  పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ప్రజల భద్రత మరియు రక్షణలో భాగంగా అన్ని ముఖ్య కూడళ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలు & రహదారులపై సంచరిస్తూ పోలీసు పెట్రోలింగ్ చేస్తూ గస్తీ నిర్వహించారు.
ట్రాఫిక్ నియంత్రణ, నేరాల కట్టడిపై నిఘా, రోడ్డు సేఫ్టీ నియమాలపై ప్రజల్లో అవగాహన, తదితర చర్యలు చేపట్టారు.
ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగులకు దూరంగా ఉండాలన్నారు.
పరిమితికి మించి ప్రయాణీకులను ఆటోలలో తరలిస్తే చర్యలు తప్పవని సూచించారు.
రహదారి భద్రత నియమాల ఉల్లంఘనలపై పోలీసులు చర్యలు చేపట్టారు.