*అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాలు శుభ్రంగా, వేడిగా, రుచిగా ఉండాలి*
*పాత బస్ స్టాండ్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
కర్నూలు, జూలై 30:- అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాలు శుభ్రంగా, వేడిగా, రుచిగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్న క్యాంటీన్ సిబ్బందిని ఆదేశించారు..
బుధవారం స్థానిక పాత బస్ స్టాండ్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు..
ఈ సందర్భంగా కలెక్టర్ అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు..ప్రతి రోజు భోజనం ఇక్కడే చేస్తారా?? భోజనం ఏ విధంగా ఉంది?? అని ఆరా తీశారు.. వారు స్పందిస్తూ ప్రతి రోజు ఇక్కడే భోజనం చేస్తామని, భోజనం నాణ్యతగా, రుచిగా ఉంటుందని కలెక్టర్ కి తెలిపారు.. అన్న క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఎంతమంది భోజనం చేస్తున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు..అన్న క్యాంటీన్ లో మంచి భోజనం అందించడం తో పాటు శుభ్రత పాటించాలని, సకాలంలో భోజనం అందించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు..బయట కింద కూర్చొని భోజనం చేస్తున్న వారి కొరకు టేబుల్ లను ఏర్పాటు చేయించాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా అన్న క్యాంటీన్ పరిసరాలలో పూలు అమ్ముకునే వారితో కూడా మాట్లాడారు.. పూలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు?? ప్రతిరోజు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తారా?? భోజనం రుచి ఏ విధంగా ఉంది ?? ఏమైనా పెన్షన్ వస్తుందా ?? అని కలెక్టర్ వారిని ఆరా తీశారు.. వారు స్పందిస్తూ పూలు బెంగళూరు నుండి తీసుకొచ్చి అమ్ముతామని, ప్రతిరోజు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తామని, భోజనం చాలా రుచిగా ఉంటుందని కలెక్టర్ కి తెలిపారు.. అర్హత ఉండి పెన్షన్ ఎవరికైనా రాకపోతే వెంటనే దరఖాస్తు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.. కలెక్టర్ పూల మార్కెట్ ను పరిశీలిస్తూ ఇక్కడ మొత్తం ఎన్ని షాప్ లు ఉన్నాయి?? మున్సిపాలిటీ వారు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు?? అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు..
జిల్లా కలెక్టర్ వెంట కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...
--------DIPRO, KURNOOL------