*జీడి ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించిన కలెక్టర్*
V3.tv. ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ తవిటి రాజు
పార్వతీపురం, జూలై 30 : పార్వతీపురంలో గల జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ప్రాసెసింగ్ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాసెసింగ్ ను మంచి నాణ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నాణ్యత ప్రమాణాలు చక్కగా ఉండటం వలన మార్కెట్లో ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా మార్కెటింగ్ కు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని చెప్పారు. జీడి పరిశ్రమకు జిల్లా అణువుగా ఉంటుందని, జిల్లాలో పెద్ద ఎత్తున జీడి ఉత్పాదకత ఉండటం, ఇందుకు
సహకరిస్తుందని ఆయన చెప్పారు. సిబ్బంది ఎప్పటికప్పుడు మంచి నైపుణ్యాభివృద్ధిని సాధిస్తూ మార్కెట్కు ధీటుగా ప్రాసెసింగ్ చేస్తూ ఒక ఆకర్షణగా నిలవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె హేమలత, తదితరులు పాల్గొన్నారు.