*రైతులు బ్యాంకుల వద్ద ఎన్ పిసిఐ చేయించుకోవాలి*
పార్వతీపురం, జూలై 31 : అన్నదాత సుఖీభవ పథకం పొందుటకు రైతులు బ్యాంకుల వద్ద ఎన్ పిసిఐ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో దాదాపు 14 వందల మంది రైతుల ఎన్ పిసిఐ (NPCI) వివరాలు పెండింగ్ లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు సంబంధిత బ్యాంక్ వద్దకు వెళ్లి ఎన్ పిసిఐ చేయించుకోవాలని అన్నారు. ఎన్ పిసిఐ పెండింగ్ ఉన్న రైతుల వివరాలు గ్రామ రైతు సేవా కేంద్రంలో ఉన్నాయని ఆయన తెలిపారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు తెలియజేస్తారని జిల్లా కలెక్టర్ చెప్పారు.
రైతులు ఎన్ పిసిఐ కు బ్యాంక్ వద్దకు వచ్చినప్పుడు బ్యాంక్ అధికారులు సహకరించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.