నగర సమగ్రాభివృద్ధికి కృషి
• నగరపాలక నూతన కమిషనర్ పి.విశ్వనాథ
నగర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని నగరపాలక సంస్థ నూతన కమిషనర్ పి.విశ్వనాథ అన్నారు. శుక్రవారం నగరపాలక కార్యాలయంలో ఆయన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, రహదారుల విస్తరణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, అన్యాక్రాంతమైన పార్కు స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలన సాగిస్తామన్నారు. కాగా కమిషనర్‌కు అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, ఇంచార్జీ ఎస్‌ఈ శేషసాయి, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.