*నగరపాలకలో 19 అర్జీలు స్వీకరణ*

*నగరపాలకలో 19 అర్జీలు స్వీకరణ*

నగరపాలక సంస్థ;
V3టీవీ న్యూస్ కర్నూలు టౌన్:
సోమవారం 

నగరపాలక సమస్త సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ విభాగాలకు సంబంధించి 19 అర్జీలను ప్రజల నుంచి అధికారులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్ఈ డి.వేణుగోపాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, సెక్రటరీ నాగరాజు, ఆర్ఓ జునైద్, డిసిపి సంధ్య, టిడ్కో అధికారి పెంచలయ్య, డిపిఓ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

*వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..*

1. ధర్మపేట రైల్వే బ్రిడ్జి దగ్గర 5 నెలల క్రితం నిర్మించిన మరుగుదొడ్లకు తలుపులు విరిగిపోయాయని, నాసిరకమైన పనులు చేసిన సంబంధిత గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలని ధర్మపేట ఏరియా నివాసుల సంక్షేమ సంఘం నాయకులు డి.రాజు కోరారు.
2. టిడ్కో ఇల్లు కోసం కట్టిన డిడిల నగదు వెనక్కి ఇవ్వాలని గరీబ్ నగర్ వాసులు ఎం.బషిరున్నీసా అర్జీ ఇచ్చారు.
3. తనకు తెలియకుండా తన స్థలం డ్రైనేజీ కాలువ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారని, ఇది ప్రైవేటు తన స్థలమని, అక్కడ నిర్మాణాలు చేపడుతుండగా పరిసరాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని శ్రీనివాస నగర్‌కు చెందిన ఎస్.వెంకట ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
4. ఆరోర నగర్ నందు మాంసపు అమ్మకపుదార్లు వ్యర్థాలను డ్రైనేజీ కాలువల్లో వేస్తున్నారని, తద్వారా చుట్టుపక్కల దుర్వాసన వస్తుందని డి.రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
5. టిడ్కో‌కు నగదు చెల్లించిన లబ్దిదారులకు ఇళ్ళను కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమత కోరారు.
6. పెద్ద మార్కెట్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు ఓ వ్యక్తి పశువులను ఉంచి, రహదారులను అపరిశుభ్రం, ట్రాఫిక్‌కి ఇబ్బంది కలిగిస్తున్నారని ఉమ్మన్న, తెలుగు విజయ్ కుమార్, ఫిర్యాదు చేశారు.
7. గాయత్రీ ఎస్టేట్ బిర్లగడ్డ, పందిపాడు సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నందు రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని స్థానికులు బి.విజయనాయుడు, యు.రాధ వేర్వేరుగా వినతులు ఇచ్చారు.
8. వీకర్ సెక్షన్ కాలనీ సమీపంలోని విష్ణు టౌన్‌షిప్ నందు సిసి రోడ్డు మంజూరు చేయాలని విష్ణు టౌన్ షిప్ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు డా.పి.పి. సుధాకర్ కోరారు.
9. మామిదాలపాడు, గీత ముఖర్జీ నగర్, స్టాంటన్‌పురం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని టిడిపి క్లస్టర్-6 ఇంచార్జీ వై.పరమేశ్వర్ రెడ్డి కోరారు.